నూతన ఆర్డీవో విజయ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు.

 

నూతన ఆర్డీవో విజయ్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేతలు.

బోధన్ ప్రతినిధి రాహుల్ :-  బోధన్ నూతన ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్‌ను బీజేపీ నాయకులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపికిషన్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు ఆర్డీవోకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

 

 

ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, బోధన్ ప్రాంత అభివృద్ధికి పరిపాలనా పరంగా సమన్వయంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆర్డీవో సమర్థవంతంగా సేవలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు, మాజీ కౌన్సిలర్ ధర్మపురి, మాజీ ఫ్లోర్ లీడర్ వినోద్ చిన్న, సీనియర్ నాయకులు గుంత గంగాధర్, హనుమాన్లు చారి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఎనుగంటి గౌతమ్ గౌడ్, అలాగే పేర్క వెంకటేష్, చరణ్ చింటూ, దుర్గాప్రసాద్, కన్నె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.