క్రీసెంట్ హైస్కూల్‌లో డ్రగ్స్ అవేర్‌నెస్ సదస్సు.

క్రీసెంట్ హైస్కూల్‌లో డ్రగ్స్ అవేర్‌నెస్ సదస్సు.

బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ పట్టణంలోని క్రీసెంట్ హైస్కూల్‌లో విద్యార్థులకు డ్రగ్స్ మరియు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై శుక్రవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం, విద్యార్థుల్లో చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

 

 

 

ఈ సందర్భంగా ఆల్ ఇండియా యూసీఐడీ ప్రెసిడెంట్ తస్కిన్ అహ్మద్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని హెచ్చరించారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

టౌన్ సీఐ వెంకట నారాయణ మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

 

 

కార్యక్రమంలో విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక సమస్యలపై వివరించారు. ఈ సదస్సులో నార్కో టీం సభ్యుడు సందీప్, క్రీసెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ జావిద్, యూనిస్ అహ్మద్, షేక్ ముకోద్దీన్, బస్సు తదితరులు పాల్గొన్నారు.