బక్రీద్ నేపథ్యంలో సాతాపూర్ పశువుల సంతపై సీపీ సాయి చైతన్య ఆకస్మిక తనిఖీ.
నిజామాబాద్ జిల్లా సాతాపూర్ ప్రతినిధి రాహుల్: బక్రీద్ పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ శుక్రవారం సాతాపూర్ మండలంలోని పశువుల అంగడిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పశువుల క్రయ విక్రయాల తీరుపై గ్రామ పంచాయతీ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నగర పరిధిలో ఏర్పాటు చేసిన వెటర్నరీ చెకింగ్ పాయింట్‌ను సందర్శించిన సీపీ, వెటర్నరీ అధికారులు జారీ చేస్తున్న ఆరోగ్య ధృవపత్రాలను పరిశీలించారు. పశువులను తరలిస్తున్న వాహనాలను స్వయంగా తనిఖీ చేసి రవాణా నిబంధనల అమలుపై ఆరా తీశారు.

సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ, బలి కోసం తీసుకువచ్చే ప్రతి జంతువుకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని వెటర్నరీ అధికారులను ఆదేశించారు. అక్రమ పశువుల రవాణా, అనారోగ్య పశువుల విక్రయాలు, నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
చెకింగ్ పాయింట్ల వద్ద పోలీసులు, వెటర్నరీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. బక్రీద్ సందర్భంగా ప్రజలు శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

ఈ తనిఖీల్లో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రెంజల్ ఎస్‌ఐ చంద్ర మోహన్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డా. రోహిత్ రెడ్డి, మండల వెటర్నరీ డాక్టర్లు విట్టల్, ప్రమోద్, నరేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
