మధు మలంచ హైస్కూల్లో ఉర్దూ ఉపాధ్యాయుడిని నియమించాలి: ప్రజావాణిలో ఫిర్యాదు.
బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ మండలంలోని శక్కర్నగర్లో ఉన్న మధు మలంచ హైస్కూల్లో ఉర్దూ ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలలో ఉర్దూను ప్రథమ భాషగా ఎంపిక చేసుకోవాలనుకుంటున్న విద్యార్థులకు ఉర్దూ ఉపాధ్యాయుడు అందుబాటులో లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు అడ్మిషన్లు నిరాకరిస్తున్నారని తెలిపారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

పాఠశాలలో ఉర్దూ భాషను సబ్జెక్టుగా కొనసాగిస్తూ, వెంటనే అర్హత కలిగిన ఉర్దూ ఉపాధ్యాయుడిని నియమించాలని స్థానిక రెవెన్యూ డివిజన్ అధికారిని ప్రజావాణి ద్వారా కోరినట్లు తెలిపారు.
