ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కమ్మ సంఘం.

 

ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కమ్మ సంఘం.

బోధన్ ప్రతినిధి రాహుల్‌ :-  తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.

 

 

 

కమ్మ సంఘం అధ్యక్షులు శివ నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

 

 

 

ఈ సందర్భంగా శివ నారాయణ మాట్లాడుతూ, తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. సినీ మరియు రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జయంతి వేడుకల్లో భాగంగా వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే కోటగిరి మండలం మరియు పరిసర గ్రామాల్లో కూడా ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

 

 

భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు తెలిపారు.