మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు ప్రారంభం.

మున్సిపల్ కార్మికుల రిలే దీక్షలు ప్రారంభం.

రెండు రోజుల దీక్షలను విజయవంతం చేయాలని సీఐటీయూ పిలుపు.

కామారెడ్డి ప్రతినిధి:- కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు గురువారం రెండు రోజుల రిలే దీక్షలను ప్రారంభించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నెలకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు అందించాలని కోరారు.

 

 

60 సంవత్సరాలు పైబడిన, అనారోగ్యానికి గురైన లేదా మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అర్హులైన కార్మికులకు ఇంద్రమ్మ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.

 

 

సీఐటీయూ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 

 

ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మున్సిపల్ కార్మికులు మరియు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది పాల్గొన్నారు.