పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: డాక్టర్ ప్రత్యూష.
తల్లాడ ప్రతినిధి ఉపేంద్ర:- ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని అన్నారు.
శిబిరంలో జ్వరంతో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ ఫలితాలు వచ్చినట్లు తెలిపారు. అలాగే అనారోగ్యంతో ఉన్న ఓ బాలుడికి అవసరమైన వైద్య చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. గ్రామంలో వ్యాధుల నివారణకు ప్రజలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ వైద్య శిబిరంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది పాల్గొని ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
