బీడీఎస్ఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా ఆనంద్ నియామకం.
బహుజన విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: తల్లారె సంజయ్.
భైంసా ప్రతినిధి : బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (బీడీఎస్ఎఫ్) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్‌గా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఆనంద్‌ను నియమించినట్లు బీడీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు తల్లారె సంజయ్ తెలిపారు.
గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల బీడీఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా తల్లారె సంజయ్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బహుజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆనంద్ కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా రంగ సమస్యలపై పోరాటం, సంఘం బలోపేతానికి ఆనంద్ సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. విద్యార్థి ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విస్తరించి, బహుజన విద్యార్థులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు.
నూతనంగా నియమితులైన ఆనంద్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, బహుజన విద్యార్థుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీడీఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
