హుంసా గ్రామంలో పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి.

హుంసా గ్రామంలో పల్లె దవాఖాన ప్రారంభించిన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి.

మహాలక్ష్మిమాత విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని గ్రామ అభివృద్ధికి పలు హామీలు.

బోధన్ ప్రతినిధి రాహుల్:- సాలూరా మండలంలోని హుంసా గ్రామంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మహాలక్ష్మిమాత విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

 

 

పర్యటన సందర్భంగా గ్రామస్తులు, రైతులు పలు స్థానిక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ హైస్కూల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రైతులు పొలాలకు వెళ్లే రహదారి, కుమ్మన్‌పల్లి రోడ్డులో బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గ్రామ దేవాలయాల ముందు సీసీ రోడ్ల నిర్మాణానికి, భీరప్ప మందిరం వద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను త్వరలోనే మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పల్లె దవాఖాన, అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉచితంగా భూములు విరాళంగా ఇచ్చిన దాతలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేను, దాతలను ఘనంగా సన్మానించారు.

 

 

 

ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, బోధన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేశ్వర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సాలూరా కాంగ్రెస్ అధ్యక్షుడు మందర్నా రవి, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, హుంసా గ్రామ సర్పంచ్ మార్కల్ శివకుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.