శంకోరా గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం.
వర్ని ప్రతినిధి చందర్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం శంకోరా గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల కింద రూ.10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఏఎంసీ చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ నిధుల మంజూరుకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారం అందించారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వెలగపూడి గోపాల్, సర్పంచ్ హరిసింగ్, ఉపసర్పంచ్ మంగ్తూ, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మద్దిపూడి శ్రీను, అబ్దుల్ బారి, కలల్ గిరి, హరి, జి. మోహన్, తారాచంద్, జవహర్, బలరాం, కె. మోహన్, మాజీ సర్పంచ్ పాల్ట్యా శ్రీను, పీఆర్ ఏఈ సాయిలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామస్తులు మాట్లాడుతూ, సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంలో సహకరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
