నీట్ లీకేజీకి కారకుడైన “కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ” – ఎస్ఎఫ్ఐ.

నీట్ లీకేజీకి కారకుడైన “కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ” – ఎస్ఎఫ్ఐ.

జంతర్ మంతర్ వద్ద లాఠీచార్జ్‌ను ఖండిస్తూ నిజామాబాద్ లో ఎస్ఎఫ్ఐ ర్యాలీ.

బోధన్ ప్రతినిధి రాహుల్: నిజామాబాద్ జిల్లా, బోధన్: జూలై 20 భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) అఖిల భారత కమిటీ పిలుపు మేరకు ఈరోజు స్థానిక ఎల్లమ్మ గుట్ట చౌరస్తా*లో ఎస్ఎఫ్ఐ, ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ, ఢిల్లీ *జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ , నాయకత్వంపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం తీవ్రంగా ఎస్ఎఫ్ఐ ఖండిస్తూ ప్రధాన డిమాండ్లు తెలిపారు.

నీట్ పరీక్షల లీకేజీకి బాధ్యుడైన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్* వెంటనే రాజీనామా చేయాలి. 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. నీట్ పరీక్ష వైఫల్యంతో ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్రం స్పందించకపోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ – ఎన్ టి ఏ, ను వెంటనే రద్దు* చేయాలి. కేంద్రం అమలు చేస్తున్న విద్యా కేంద్రీకరణ విధానాలు, నూతన జాతీయ విద్యా విధానం వల్లే పరీక్షల లీకేజీలు జరుగుతున్నా యన్నారు. లాఠీచార్జ్ చేసిన వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలి.కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయకరణ చేయడం మానుకోవాలి.

 

 

“భవిష్యత్తులో సమాజాన్ని కాపాడాల్సిన డాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది ప్రభుత్వ వైఫల్యమే” అని విగ్నేష్ పేర్కొన్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను కేంద్ర కేబినెట్ నుండి ప్రధాని మోడీ వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, నగర అధ్యక్షులు అజాద్, జిల్లా నాయకులు అక్షయ్, రాహుల్, రాము, తదితరులు పాల్గొన్నారు.