మద్యం మత్తులో విధులకు హాజరు.. ఉపాధ్యాయుడు సస్పెన్షన్.

మద్యం మత్తులో విధులకు హాజరు.. ఉపాధ్యాయుడు సస్పెన్షన్.

చింతపల్లి ప్రతినిధి ప్రమోద్: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పినపాడు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (పీటీఎం) సందర్భంగా మద్యం మత్తులో విధులకు హాజరైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు కె.వి. రమణను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ టి. నిషాంతి వెల్లడించారు.

 

 

 

ఈ ఘటనపై తల్లిదండ్రులు, స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు సంబంధిత అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణలో లభించిన వివరాల ఆధారంగా ప్రభుత్వ సేవా నియమావళి ప్రకారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

 

 

 

విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తే లేదా సేవా నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్రమశిక్షణ, బాధ్యతాయుత సేవలపై ఎలాంటి రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు.