బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు.. పెంజర్ల గ్రామం నుంచి కాంగ్రెస్‌, బీజేపీకి షాక్‌!

మాజీ సర్పంచ్‌ వనం బాలరాజ్‌ ఆధ్వర్యంలో 54 మంది చేరిక.. గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డి.

రంగారెడ్డి ప్రతినిధి వినోద్‌ : షాద్‌నగర్‌ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లోకి భారీగా చేరికలు జరిగాయి. కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ సర్పంచ్‌ వనం బాలరాజ్‌ ఆధ్వర్యంలో మాజీ ఉపసర్పంచులు పాముల రమేష్‌, వనం రవితో పాటు మొత్తం 54 మంది బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

 

షాద్‌నగర్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 

కాంగ్రెస్‌, బీజేపీ విధానాలు నచ్చకే బీఆర్‌ఎస్‌లో చేరికలు

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. మాజీ ఉపసర్పంచ్‌ పాముల రమేష్‌తో పాటు పలువురు నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషకరమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, బీజేపీ విధానాలపై అసంతృప్తితో ఆయా పార్టీల శ్రేణులు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నాయని ఆయన అన్నారు.

 

కేసీఆర్‌ అభివృద్ధి పనులకు ఆకర్షితులై చేరాం

బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ ఉపసర్పంచ్‌ పాముల రమేష్‌ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.

పార్టీలో చేరిన వారిలో పలువురు నాయకులు

బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో పాముల రమేష్‌, వనం రవి, పాముల శేఖర్‌, పాముల మధు, వుల మహేష్‌, కృష్ణ, పాముల మురళి, పాముల కృష్ణ, పాముల శివ, కందివనం నవీన్‌ కుమార్‌, కందివనం సత్తయ్య, ఈ. చంద్రయ్య, పి. శ్రీధర్‌, పి. సత్యనారాయణ, పాముల శ్రావణ్‌, పాముల బాలరాజ్‌, శివ, పి. గోపాల్‌, పి. భాస్కర్‌, పి. వీరేష్‌, మేకల రాజా శివ, మేకల రాజా బాలరాజ్‌, ఎం. రాకేష్‌, ఎం. రాయికల్‌ శంకర్‌, పి. రవి, కందివనం శివశంకర్‌, కందివనం నందు, వనం బాలరాజ్‌, వనం వీరేందర్‌, వన్నె మహేష్‌, వనం విష్ణు, మహేందర్‌, పొన్నం నాగార్జున, వనం శ్రీధర్‌, దేవి అజయ్‌, వీ. మహేష్‌, కోట నవీన్‌, కోట ప్రవీణ్‌, కోట శ్రీకాంత్‌, కోట చింటూ, గడ్డమీది మల్లేష్‌, శ్రీను, వర్ణం కుమార్‌, అశోక్‌, బ్యాగరి జస్వంత్‌, తెలుగు ప్రవీణ్‌, కావలి సందీప్‌, పలుకుట అక్షర, విజయకుమార్‌, కావలి నారాయణ, ఎండీ భాష తదితరులు ఉన్నారు.

 

ఈ కార్యక్రమంలో వనం బాలరాజ్‌, వనం బీరయ్య, శివచారి, బ్యాగరి రాజు, కుమ్మరి పోచయ్య, పలుకుట మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పెంజర్ల గ్రామం నుంచి ఒకేసారి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.