అంతరాష్ట్ర కబడ్డీ పోటీలకు మహేశ్వరం గురుకుల విద్యార్థిని ఎంపిక.
మహేశ్వరం, ఏప్రిల్ 06:- తెలంగాణ రాష్ట్రం తరపున అంతరాష్ట్ర కబడ్డీ పోటీలకు మహేశ్వరం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థిని పి. అలేఖ్య ఎంపిక కావడం విద్యాసంస్థకు గర్వకారణంగా మారింది.
కళాశాల ప్రిన్సిపాల్ ఈమని శ్రీలక్ష్మి తెలిపారు కి, 8వ తరగతి చదువుతున్న అలేఖ్య 30 జనవరి 2026 నుంచి 2 మార్చి 2026 వరకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించిన 35వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో అద్భుత ప్రతిభ కనబరచిందని చెప్పారు. ఆమె ప్రదర్శన ఆధారంగా తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఈమని శ్రీలక్ష్మి, అధ్యాపక బృందం అలేఖ్యను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబరచి సంస్థకు మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
