బోధన్ ప్రతినిధి రాహుల్ :- బోధన్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని Rajiv Gandhi 35వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశానికి ఆధునిక సాంకేతిక రంగానికి బలమైన పునాది వేసిన మహానేత అని కొనియాడారు. ఆయన తీసుకొచ్చిన ఐటీ విప్లవం వల్ల నేడు దేశ యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, యువత సాధికారత కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పాషా మోహినుద్దీన్, హరికాంత్ చారి, విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, ఇరెండల్ శంకర్, రవి లంక, ఇమ్రాన్ షరీఫ్, అహ్మద్, తల్లరి నవీన్, రామ్మూర్తి, శ్రీనివాస్ రెడ్డి, అక్షయ్ పటేల్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
