13వ వార్డులో అభివృద్ధి పనులు వేగవంతం – ప్రజల హర్షం.
బోధన్ ప్రతినిధి రాహుల్:- నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని 13వ వార్డులో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వార్డు కౌన్సిలర్ లంకా రవి ఆధ్వర్యంలో డ్రైనేజీ తవ్వకాలు, కాలువల మరమ్మతులు, శుభ్రత కార్యక్రమాలు చేపడుతుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని స్థానికులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వార్డును శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు కౌన్సిలర్ కృషి చేస్తున్నారని వారు కొనియాడారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్‌లకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.
13వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగకరంగా మారడంతో ప్రజాప్రతినిధుల సేవలను స్థానికులు అభినందిస్తున్నారు.
