రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణకు బోధన్ ఆర్డీఓ సానుకూల స్పందన.

రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణకు బోధన్ ఆర్డీఓ సానుకూల స్పందన.

బోధన్ ప్రతినిధి రాహుల్‌:-  ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ విస్తరణ కార్యక్రమంలో భాగంగా బోధన్ రెవెన్యూ డివిజన్ అధికారి విజయకుమారిని రెడ్ క్రాస్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు.

 

 

 

ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిధులు సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు, సభ్యత్వం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి ఆర్డీఓకు వివరించారు. దీనికి స్పందించిన ఆర్డీఓ విజయకుమారి, తమ కార్యాలయ సిబ్బందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం స్థానిక ఎంఆర్వో విట్టల్‌ను కూడా ప్రతినిధులు కలిసి సభ్యత్వ విస్తరణపై చర్చించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ, రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరువ అవుతాయని పేర్కొన్నారు.

 

 

ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, డివిజన్ చైర్మన్ బసవేశ్వర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రావు, బోధన్ మండల చైర్మన్ కొడాలి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.