కందకుర్తి త్రివేణి సంగమంలో జ్యేష్ఠ పౌర్ణమి వేడుకలు ఘనంగా.

కందకుర్తి త్రివేణి సంగమంలో జ్యేష్ఠ పౌర్ణమి వేడుకలు ఘనంగా.

రెంజల్ ప్రతినిధి రాహుల్ :-  నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమంలో అధిక జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తేప్పలు వదులుతూ తమ మొక్కులు తీర్చుకున్నారు.

 

 

అనంతరం నది ఒడ్డున ఉన్న పురాతన శివాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పౌర్ణమి పర్వదినం సందర్భంగా సంగమ ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్థానిక అధికారులు తగిన ఏర్పాట్లు చేసి అవసరమైన సౌకర్యాలు కల్పించారు.