ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య – ప్రధానోపాధ్యాయులు కందుకూరి శేఖర్.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య – ప్రధానోపాధ్యాయులు కందుకూరి శేఖర్.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల నమోదును పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని కోనాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కందుకూరి శేఖర్ తెలిపారు.

 

 

 

బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాల గురించి వివరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, మధ్యాహ్న భోజన పథకం, మెరుగైన విద్యా వాతావరణం వంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

 

 

 

ఈ సందర్భంగా ఆరవ తరగతి ఇంగ్లీష్ మీడియంలో నిఖిత, శృతిక, అక్షయ, అరవింద్ అనే నలుగురు విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో చేరినట్లు ఉపాధ్యాయులు వెల్లడించారు. మరిన్ని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింగ్‌రావు, శివప్రసాద్, స్నేహలత తదితరులు పాల్గొన్నారు.