ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 13వ వార్డు సభ విజయవంతం.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 13వ వార్డు సభ విజయవంతం.

బాన్సువాడ ప్రతినిధి షేక్ అమైర్ :-  బాన్సువాడ, జూన్ 8: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీ వడ్ల సంఘం వేదికగా 13వ వార్డు సభ సోమవారం విజయవంతంగా నిర్వహించారు.

 

 

 

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ వార్డు సభను నిర్వహించినట్లు 13వ వార్డు కౌన్సిలర్ ఎం.ఏ. ఖలేక్, కో-ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ తెలిపారు.

వార్డు ప్రజలు, స్థానిక నాయకులు, వివిధ శాఖల అధికారుల సమక్షంలో జరిగిన సభలో ఇందిరమ్మ ఇళ్లు, ఆసరా పెన్షన్లు, జీరో విద్యుత్ బిల్లు పథకం, కొత్త రేషన్ కార్డులు, రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం తదితర సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, సమస్యలను పరిశీలించి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

 

 

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, మున్సిపల్ కమిషనర్ జి. గంగాధర్, మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్ రెడ్డి, సతీష్, విద్యుత్ శాఖ అధికారి జిలియ నాయక్, ఆరోగ్య శాఖ ప్రతినిధి శోభ, విద్యాశాఖ అధికారి నరహరి, ఎస్‌ఐ రాములు, రెవెన్యూ శాఖ జీపీఓ అర్జున్, రెప్రజెంటేటివ్ మెంబర్ వాణి తదితరులు పాల్గొన్నారు.

 

 

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలు, అధికారులు, నాయకులకు కౌన్సిలర్ ఎం.ఏ. ఖలేక్ మరియు కో-ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.