చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి: బంగారు సాయిలు.

చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి: బంగారు సాయిలు.

అంబేద్కర్ గ్రంథాల పంపిణీ కార్యక్రమం • ఇప్పటివరకు 50 వేలకుపైగా పుస్తకాల పంపిణీ • రాజ్యాంగంపై ప్రజల్లో చైతన్యమే లక్ష్యం.

 కోటగిరి ప్రతినిధి రాహుల్ : ప్రజల్లో చట్టంపై అవగాహన పెంపొందించేందుకే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన గ్రంథాలను పంపిణీ చేస్తున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త, దళిత-బహుజన సంఘాల నాయకుడు బంగారు సాయిలు తెలిపారు. మంగళవారం కోటగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ రచించిన పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు.

 

 

ఈ సందర్భంగా బంగారు సాయిలు మాట్లాడుతూ, అన్ని మతాలకు సంబంధించిన గ్రంథాలను చదివినట్లే అంబేద్కర్ రచించిన చట్టపరమైన పుస్తకాలను కూడా ప్రతి ఒక్కరూ చదవాలని సూచించారు. ప్రజలకు రాజ్యాంగం, చట్టాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఇప్పటివరకు 50 వేలకుపైగా పుస్తకాలను పంపిణీ చేశామని, భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో దళిత, బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.