గాంధారి బస్టాండ్‌లో పోలీసు కళాబృందం అవగాహన కార్యక్రమం.

కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, గాంధారి సబ్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఎం. మహేందర్ సూచనలతో గాంధారి బస్టాండ్ ఆవరణలో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 

 

 

దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదనే అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలకు గురికాకుండా ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930, మాదకద్రవ్యాల సమాచారానికి 1908, అత్యవసర పరిస్థితుల్లో 100/112కు కాల్ చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, కామారెడ్డి షీ టీమ్ నంబర్ 8712686094ను అవసరమైనప్పుడు వినియోగించాలని తెలిపారు.

 

 

అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, దొంగతనాల నివారణకు అప్రమత్తంగా ఉండడం, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీసు కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ శేషరావు, కానిస్టేబుల్ ప్రభాకర్ పాటలు, సందేశాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ప్రకాష్, హెడ్ కానిస్టేబుల్ రమేష్, ఆర్టీసీ కంట్రోలర్, ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.