ఏకచక్రనగర్‌లో భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ.
బోధన్ ప్రతినిధి రాహుల్:
బోధన్ పట్టణంలోని ఏకచక్రనగర్‌లో గంగాపుత్ర మరాఠా సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు గాటుమల్ సాగన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వార్డు కౌన్సిలర్ గుమ్ముల అశోక్‌రెడ్డి, సుభాష్, దశరథ్, థానాజీ, సీతారాం, గణేష్, దీపక్, పవన్, బాపూజీతో పాటు మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాజాభజంత్రీల నడుమ మహిళలు ఏకచక్రనగర్ నుంచి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడిపంటలు బాగా పండాలని, వ్యాపారాలు అభివృద్ధి చెందాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

భక్తుల జైజైధ్వానాలు, సంప్రదాయ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో బోనాల వేడుకలు ఘనంగా ముగిశాయి.

