బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ ఘన నివాళి.

బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ ఘన నివాళి.

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి రాహుల్‌:-  నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. నాయకులు, కార్యకర్తలు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు.

 

 

ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి సోంపూర్ పోచిరాం మాదిగ మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి, బలహీన వర్గాల హక్కుల కోసం Babu Jagjivan Ram చేసిన కృషి సమాజానికి దిశానిర్దేశమని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో “సామాజిక న్యాయం జయహో” నినాదాలు వినిపించాయి. మండల, గ్రామ స్థాయి ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.