హిందువులపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు.

హిందువులపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు.

రుద్రూర్‌ ప్రతినిధి చందర్:- 

నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో రెంజర్ల రాజేష్ అనే వ్యక్తిపై పలువురు హిందూ సంస్థల ప్రతినిధులు రుద్రూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మత సామరస్యానికి భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.

 

 

 

ఇటువంటి వ్యాఖ్యలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంతోష్, గణేష్, ప్రశాంత్‌తో పాటు వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.