ముసారాం బాగ్ లో ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు.
హైద్రాబాద్ ప్రతినిధి విశ్వంభర్ :-
ముసారం బాగ్ లో నెలకొన్న రుక్మిణి పాండురంగని ఆలయం లో ఆషాఢ శుద్ధ ఏకాదశి ను పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయనీ తెలంగాణ మరాఠా సమాజ్ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 24 వ తేదీ శుక్రవారం దశమి నాడు ఉదయం 6 గంటల నుంచి 12 వరకు అభిషేకాలు,అలంకారం, అర్చన, మహా నైవేద్యం మరియు సాయంత్రం 6 గంటల నుంచి 12 వరకు అర్చన,హారతి, భజన నిర్వహించబడుననీ అలాగే 25 వ తేదీ శనివారం శుద్ద ఏకాదశి ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు, అలంకారం,పుష్పార్చనాలు, తులసి అర్చనలు, హారతి నైవేద్యం ,సర్వ దర్శనం, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రథ యాత్ర అనంతరం భజన తో పాటు జాగరణ కార్యక్రమం ఉంటాయని అన్నారు.
26 తేదీ ఆదివారం ద్వాదశి నాడు ఉదయం 5 గంటల నుంచి 6 వరకు కాకడ హారతి, అలాగే 6 గంటల నుంచి 7 గంటల వరకు గోపాలకాల సేవ, 7 గంటల కు అర్చన తర్వాత హారతి నైవేద్యం అనంతరం ఉదయం 8 గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు అర్చన, హారతి ఉంటుందనీ కావున భక్తులు సకాలంలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవ్వలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సుందర్ రావు వాగ్మరే, ఉపాధ్యక్షులు రాజేష్ వాగ్మరే, ప్రధాన కార్యదర్శి నితీష్ రావు, అశోక్ రావ్,లక్మన్ రావ్ కాంబ్దే తో పాటు తదితరులు పాల్గొన్నానున్నారు.
