ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఘనంగా సేవా కార్యక్రమాలు.

ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఘనంగా సేవా కార్యక్రమాలు.

బోధన్ ప్రతినిధి రాహుల్ : బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. 2005 సంవత్సరం నుంచి గత 21 ఏళ్లుగా నిరంతరంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.

 

 

 

ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయగా, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సేవా భావాన్ని చాటుకున్నారు.

 

 

 

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దాము, పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్, వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి, మందర్ణ రవి, సిద్ధాపూర్ శరత్, జిల్లా ఉపాధ్యక్షుడు పాషా, ఖాజాపూర్ అశోక్, ఎన్‌ఐసీయూ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.