చేనేత దినోత్సవ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు.

చేనేత దినోత్సవ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు.

ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

చండూరు ప్రతినిధి రాము:-  తెలంగాణ ప్రభుత్వం చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 7 నుంచి 12 వరకు నిర్వహించనున్న జాతీయ చేనేత దినోత్సవ వేడుకలకు చండూరులో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 

 

 

ఈ వేడుకలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు పున్న ధర్మేందర్, పాలకవర్గ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

 

చండూరు చేనేత సహకార సంఘం కార్యాలయంలో 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్రాస్ విశ్వవిద్యాలయంలో తొలి జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

చేనేత కార్మికుల జీవనోపాధిని మెరుగుపరచడం, చేనేత మగ్గానికి దేశవ్యాప్తంగా మరింత ఆదరణ కల్పించడం, భారతీయ చేనేత సంప్రదాయాన్ని పరిరక్షించడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని సంఘం ప్రతినిధులు తెలిపారు.