సీసీ రోడ్లకు మోక్షం ఎప్పుడో?

సీసీ రోడ్లకు మోక్షం ఎప్పుడో?

చండూరు ప్రతినిధి రాము : చండూరు పట్టణంలోని 1వ వార్డు సత్య హరిశ్చంద్ర నగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం కోసం స్థానిక ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచి బురదమయంగా మారుతోంది. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

 

 

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే, కౌన్సిలర్‌ ఆధ్వర్యంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ముందుకు సాగలేదని స్థానికులు తెలిపారు. అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వం సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చిందని, మున్సిపల్‌ ఎన్నికలకు ముందు కూడా పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను పలుమార్లు తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను వెంటనే ప్రారంభించాలని, ప్రజల ఇబ్బందులను తొలగించాలని వారు కోరుతున్నారు.