బాన్సువాడలో ఆలయానికి విగ్రహ బహుకరణ కార్యక్రమం.
బాన్సువాడ ప్రతినిధి:- బాన్సువాడ పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో ఉన్న శ్రీశ్రీశ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి ఆలయానికి భక్తులు భక్తిశ్రద్ధలతో ఉత్సవ విగ్రహాలను బహుకరించారు. పట్టణానికి చెందిన దాతలు సంజీవ్ గుప్త, శివలక్ష్మి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సుమారు రూ. 9,100 విలువ గల ఉత్సవ విగ్రహాన్ని ఆలయానికి అందజేశారు.
బుధవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు జపాల పాండురంగ శర్మకు ఈ విగ్రహాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతల సేవాభావాన్ని కొనియాడుతూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
