బాన్సువాడలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఘనంగా నిర్వహణ.

బాన్సువాడలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి ఘనంగా నిర్వహణ.

బాన్సువాడ ప్రతినిధి :- బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహాత్మ జ్యోతిబా పులే పులే (Mahatma Jyotiba Phule) జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యోతిబా పూలే సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు, విద్యా విస్తరణకు చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, ప్రతి విద్యార్థి పూలే ఆలోచనలను ఆచరణలో పెట్టాలని సూచించారు.

 

 

 

కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పిట్ల శ్రీధర్, ఎజాస్, దాసరి శ్రీనివాస్, యువ నాయకులు కాసుల రోహిత్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఖాలేక్, హకీమ్, లాయఖ్, అధ్యాపకులు స్వరూప్, జూనియర్ అసిస్టెంట్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు. వారు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.