విద్యా విజయోత్సవం ఘనంగా నిర్వహణ – ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.

విద్యా విజయోత్సవం ఘనంగా నిర్వహణ – ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు.

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం ప్రతినిధి రాహుల్ :-  ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల ముగింపు సందర్భంగా టీజీఎంఎస్ అంబం పాఠశాలలో “విద్యా విజయోత్సవం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తిని పెంపొందించడం, ప్రతిభను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.

 

 

ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, క్రీడా విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నగదు బహుమతులు అందజేసి సత్కరించారు. ఇంటర్మీడియట్‌లో 976 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని డి. రక్షితను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేకంగా అభినందించి సన్మానించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాఘవేందర్ కులకర్ణి తెలిపారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రతిభకు గుర్తింపుగా అందిస్తున్న ప్రోత్సాహకాలు విద్యార్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని పేర్కొన్నారు.

 

 

కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొని విజయోత్సాహాన్ని పంచుకున్నారు.