ప్రజల ఆరోగ్య రక్షణకు లయన్స్ క్లబ్ వినూత్న కార్యక్రమం

 

బోధన్ ప్రతినిధి రాహుల్ :- లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద బుధవారం ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

 

 

ఈ కార్యక్రమంలో 13వ వార్డు కౌన్సిలర్ లంకా రవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలో తిరగకుండా చెట్ల నీడలో లేదా ఇళ్లలోనే ఉండాలని సూచించారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు ఎక్కువగా నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

 

 

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లయన్స్ క్లబ్ చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.