బాన్సువాడలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక వారోత్సవాలు.

బాన్సువాడలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక వారోత్సవాలు.

 

బాన్సువాడ ప్రతినిధి విశ్వంబార్ కుల్కర్ని:-  ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెప్మ, ఎస్ఇఆర్పీ ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణం మరియు గ్రామీణ మండలంలో వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సంఘాల, వార్డు సంఘాల అధ్యక్షులు మరియు వీవోఏలతో సమావేశం నిర్వహించారు.

 

 

 

ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బాన్సువాడ మండలాలకు మంజూరైన మండల మహిళా సమాఖ్య సామూహిక నిర్వహణ శిక్షణ కేంద్రాల్లో భాగంగా, బాన్సువాడ మండల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

 

 

 

తదుపరి, బాన్సువాడ మండల సమాఖ్య పరిధిలోని 52 మహిళా సంఘాలకు గాను రూ.6.13 కోట్ల చెక్కులను మహిళా సంఘాల అధ్యక్షులకు అందజేశారు. అలాగే ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల్లో నలుగురికి చెక్కులు పంపిణీ చేశారు.

 

 

 

 

అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కాసుల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 10 మహిళా సంఘాలకు గాను రూ.2 కోట్ల చెక్కులను అందజేశారు. అలాగే బాన్సువాడ పట్టణంలో 18 సంవత్సరాలు పైబడిన అర్హత కలిగిన తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ చీరలను పంపిణీ చేశారు.

 

 

 

ఈ కార్యక్రమంలో కామారెడ్డి మెప్మ పీడీ శ్రీధర్ రెడ్డి, ఏపీడీ విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్, బాన్సువాడ పట్టణ మరియు గ్రామీణ మండల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.