కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్న ఏఎంసీ చైర్మన్ సురేష్ బాబాకు ఎమ్మెల్యే పోచారం ఘన సత్కారం.
వర్ని ప్రతినిధి చందర్: వర్ని ఉమ్మడి మండలాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ కులకర్ణి సురేష్ బాబు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం స్వీకరించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సత్కరించారు. శాలువా కప్పి అభినందనలు తెలియజేస్తూ ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 1996 జూలై 29న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించిన సురేష్ బాబు మూడు దశాబ్దాలుగా పార్టీ జెండాను గౌరవంగా మోస్తూ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ కార్యదర్శి గోపాల్, పీఏసీఎస్ చైర్మన్ సాయిబాబు, మాజీ ఎంపీటీసీ కలాల్ గిరి, సీనియర్ నాయకులు అబ్దుల్ బారి, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు దారం గంగాధర్, వార్డు సభ్యులు గంగాధర్, సరిచంద్, నాయకులు మారుతి సేట్, లల్లు తదితరులు పాల్గొని కులకర్ణి సురేష్ బాబాను అభినందించారు.
