బోధన్‌లో ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

బోధన్‌లో ముత్తూట్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

బోధన్ ప్రతినిధి రాహుల్ :- ముత్తూట్ ఫైనాన్స్ తమ సామాజిక బాధ్యత కార్యక్రమమైన “ముత్తూట్ స్నేహాశ్రయ”లో భాగంగా బోధన్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. అధునాతన వైద్య సదుపాయాలతో కూడిన మొబైల్ ల్యాబొరేటరీ వాహనాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన సుమారు 120 మంది పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.

 

 

 

ఈ వైద్య శిబిరంలో షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, కిడ్నీ, లివర్ సంబంధిత పరీక్షలతో పాటు మూత్రపిండాల వ్యాధులను ముందస్తుగా గుర్తించే వైద్య పరీక్షలు చేపట్టారు. అదనంగా రక్తపోటు (బీపీ), హైపర్‌టెన్షన్, గుండె సంబంధిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంపై లబ్ధిదారులు ముత్తూట్ ఫైనాన్స్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

 

 

 

ఈ కార్యక్రమంలో ముత్తూట్ ఫైనాన్స్ రీజినల్ మేనేజర్ మహేష్ బాబు, మార్కెటింగ్ మేనేజర్ రఘు, క్లస్టర్ ఇంచార్జీ షాదుల్, బోధన్ బ్రాంచ్ మేనేజర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.