పోరిక ప్రేమ్ చంద్‌కు ఘన నివాళులు.. బంధుమిత్రులు, నాయకుల శ్రద్ధాంజలి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి: హనుమకొండ జిల్లా పోచమ్మకుంటలో రిటైర్డ్ హిందీ పండిట్, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోరిక ప్రేమ్ చంద్ మృతదేహానికి బంధుమిత్రులు, ప్రజాప్రతినిధులు, సామాజిక నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రేమ్ చంద్ అనురాగం, ఆప్యాయత, మంచితనానికి ప్రతీకగా నిలిచారని, ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కార్యక్రమంలో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. నాయక్, జవహర్ లాల్ నాయక్, డీఎస్పీ కరంచంద్, పోరిక రవినాథ్, రవీందర్ నాయక్, లావుడియా రాజు నాయక్, నారాయణ సింగ్, నందా నాయక్, ప్రవీణ్ కుమార్, భూక్య శ్రావణ్ కుమార్, అజ్మీర రవీందర్ నాయక్, సర్పంచ్ అమృ నాయక్, విజయ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
