జలాల్‌పూర్‌లో నూతన వస్త్రధారణ మహోత్సవం ఘనంగా నిర్వహణ.

జలాల్‌పూర్‌లో నూతన వస్త్రధారణ మహోత్సవం ఘనంగా నిర్వహణ.

చిన్నారులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.

వర్ని ప్రతినిధి చందర్:-  వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలో నూతన వస్త్రధారణ మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఇల్తెం మమత–బాలు దంపతుల కుమారుడు ప్రణవ్, కుమార్తె ఆరాధ్యతో పాటు ఇల్తెం పావని–శంకర్ దంపతుల కుమార్తె శ్రేష్ట, కుమారుడు శ్రేయాన్‌ల నూతన వస్త్రధారణ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా జరిగింది.

 

 

 

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి పాల్గొని చిన్నారులకు ఆశీస్సులు అందజేశారు.

 

 

కార్యక్రమంలో ఉమ్మడి వర్ని మండల ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.