ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తల్లాడ కాంగ్రెస్ నాయకులు.
తల్లాడ ప్రతినిధి ఉపేంద్ర : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు విద్యుత్ శాఖల మంత్రి Bhatti Vikramarka జన్మదిన వేడుకలను తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొడుగునూరు లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా గొడుగునూరు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారని, రాష్ట్ర పునర్నిర్మాణంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ముఖ్యమంత్రి A. Revanth Reddy నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు.

బడ్జెట్‌లో ఖమ్మం జిల్లాకు అధిక నిధులు కేటాయించడం ద్వారా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. జిల్లా మంత్రులు Tummala Nageswara Rao, Ponguleti Srinivasa Reddy సహకారంతో సత్తుపల్లి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. భట్టి విక్రమార్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రటరీ గోవిందు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ ముకరా ప్రసాద్, కంచపోగు వెంకటేశ్వర్లు, దీవెల వెంకటేశ్వరరావు, దిరిశాల నరసింహారావు, మారెళ్ల మల్లికార్జునరావు, తుమ్మలపల్లి రమేష్, తాళ్ల జోసెఫ్, సామినేని రామ అప్పారావు, దుండేటి వీరారెడ్డి, షేక్ ఇమామ్ సాహెబ్, వెంకట నారాయణ రెడ్డి, పొట్టేటి జనార్ధన్ రెడ్డి, తాళ్ల వెంకటేశ్వర్లు, వేమిశెట్టి నాగన్న, కోసూరి వెంకటేశ్వర్లు, రావుల గోపి గౌడ్, కటికి కిరణ్, భూక్యా అంజయ్య, నాగేశ్వరరావు, అన్నేం కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

