అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో బాన్సువాడలో యోగా వాక్ నిర్వహణ.

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో బాన్సువాడలో యోగా వాక్ నిర్వహణ.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్: రాబోయే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21)ను పురస్కరించుకుని బాన్సువాడ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వ యునాని వైద్యశాల నిర్వహణలో సోమవారం “యోగా వాక్” కార్యక్రమం నిర్వహించారు.

 

 

 

భారత ప్రభుత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర ఆయుష్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు వొట్లం శ్రీనివాస్ గౌడ్ పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం యోగా కేంద్రంలో కామన్ యోగా ప్రోటోకాల్ (CYP)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

 

 

 

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా సంపూర్ణ జీవన విధానమని తెలిపారు. ప్రతిరోజూ యోగా ఆసనాలు అభ్యసించడం ద్వారా అనేక శారీరక సమస్యలను నివారించవచ్చని, ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని ప్రాణాయామం, ధ్యానం ద్వారా అధిగమించవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

 

ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు, విద్యార్థులు మరియు పలువురు స్థానికులు పాల్గొన్నారు.

 

Tags:

#YogaDay, #InternationalYogaDay, #YogaWalk, #AYUSH, #Banswada, #Telangana, #YogaAwareness, #CYP, #GovernmentUnaniHospital, #HealthAndWellness, #YogaForAll, #AyushDepartment, #Meditation, #Pranayama, #BanswadaNews