బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి: దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్.

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి: దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్.

బోధన్ ప్రతినిధి రాహుల్: బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాదన్నగారి విఠల్, వీజీ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం బోధన్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమిర్ నివాసంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు.

 

 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బూత్ కమిటీలు చురుకుగా పాల్గొని ప్రతి కార్యకర్త బాధ్యతగా పని చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 85 లక్షల సభ్యత్వాల నమోదును లక్ష్యంగా పార్టీ నిర్దేశించిందని తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు నిర్వహించనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు.

పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కీలకమని, ప్రతి గ్రామం, వార్డులో విస్తృతంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని పిలుపునిచ్చారు.

 

 

ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు రవీంద్ర యాదవ్, సంజీవ్, నరసయ్య, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రవిశంకర్ గౌడ్, మిర్జాపురం హరీశంకర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.