ల్లాడలో ముమ్మరంగా ఓటర్ల సవరణ కార్యక్రమం.
నవగీతం ప్రతినిధి తల్లాడ :- తల్లాడ మండల పరిధిలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (SIR) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారులు (BLO) స్థానిక ఓటర్లను కలిసి ఓటు హక్కు ప్రాధాన్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తప్పుల సవరణ కోసం సంబంధిత ఫారాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ వస్తున్న బీఎల్‌ఓలకు మండల ప్రజలు, ఓటర్లు పూర్తి స్థాయిలో సహకరించి తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
