ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని 19 ఏళ్ల యువతి
షాద్‌నగర్ ప్రతినిధి వినోద్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 19 ఏళ్ల యువతి అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన బాలాజీ బస్వడే కుమార్తె (19) ప్రస్తుతం షాద్‌నగర్ పరిధిలోని రాంపురం కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. సెప్టెంబర్ 29, 2026న ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
అదృశ్యమైన యువతి ఎత్తు సుమారు 4.5 అడుగులు ఉంటుందని, ఆమెకు మరాఠీ, హిందీ భాషలు వచ్చని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి వెళ్లిన సమయంలో నలుపు రంగు టాప్, నలుపు రంగు ప్యాంట్ లేదా నలుపు రంగు బురఖా ధరించి ఉండవచ్చని పేర్కొన్నారు.
యువతి ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. యువతి ఆచూకీ గుర్తించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
