బోధన్‌లో ఏసీబీ దాడులు – ఎస్ఐ భాస్కర చారి అదుపులో.
బోధన్ ప్రతినిధి రాహుల్:- బోధన్ పట్టణంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర చారి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

లంచం స్వీకరణ ఆరోపణల నేపథ్యంలో ఆయనను పోలీస్ స్టేషన్లోనే ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, లంచం మొత్తం, ఫిర్యాదుదారు వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఈ ఘటనతో బోధన్ పట్టణంలో కలకలం రేగగా, ఏసీబీ అధికారులు సాక్ష్యాలను సేకరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
