కోహెడలో ఘనంగా ప్రారంభమైన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం.
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు పిలుపు – సర్పంచ్ బందెల సుజాత.
సిద్దిపేట జిల్లా ప్రతినిధి రాజు :- కోహెడ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బందెల సుజాత ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బందెల సుజాత మాట్లాడుతూ, మండల కేంద్రంతో పాటు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకొని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.
ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు నోట్‌బుక్స్, మధ్యాహ్న భోజన సౌకర్యం, ఇతర అవసరమైన సదుపాయాలను అందిస్తున్నదని పేర్కొన్నారు. ఈ అవకాశాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.
అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
