బక్రీద్ పండుగ నేపథ్యంలో బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం.

బక్రీద్ పండుగ నేపథ్యంలో బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో శాంతి కమిటీ సమావేశం.

బాన్సువాడ ప్రతినిధి విశ్వంభర్ : రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో సోమవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి అధ్యక్షత వహించగా, పట్టణానికి చెందిన ముస్లిం, హిందూ మత పెద్దలు పాల్గొన్నారు.

 

 

ఈ సందర్భంగా డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ, పండుగలను పరస్పర సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. బాన్సువాడ పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.

 

 

 

మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే ఎలాంటి ఘటనలనైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

 

 

సమాజంలో ఐక్యత, సామరస్య వాతావరణం నెలకొనేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో పాల్గొన్న మత పెద్దలు కూడా పండుగలను శాంతియుతంగా నిర్వహించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.