రుద్రూర్ జాతీయ రహదారిపై విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి.
వర్ని ప్రతినిధి చందర్ : వర్ని మండల కేంద్రంలోని కోటయ్య క్యాంపు నివాసి భూమేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రుద్రూర్ మండల కేంద్రం సమీపంలో జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో సిమెంట్ ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భూమేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించగా, భూమేష్‌ను ముందుగా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న ఇదే ప్రాంతంలో గతంలో కూడా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, నిర్మాణ పనుల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
