డాక్టర్ నికిత సూరజ్ కుమార్తె నామకరణ, ఉయ్యాల వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్.
హనుమకొండ ప్రతినిధి : హనుమకొండ జిల్లా హంటర్ రోడ్డులోని అలకనంద కన్వెన్షన్ ఏసీ హాల్లో డాక్టర్ నికిత సూరజ్ కుమార్తె నామకరణ, ఉయ్యాలలో వేయడం కార్యక్రమం ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత వీఎన్ నాయక్, కృష్ణకుమారి బావసింగ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు పలువురు రాజకీయ, సామాజిక, ప్రజాప్రతినిధులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్, డాక్టర్ రూప్సింగ్ నాయక్, డీఎస్పీ పెద్దన కుమార్, అజ్మీర శ్రీరామ్ నాయక్, డాక్టర్ బోజ నాయక్, మాజీ కార్పొరేటర్లు లావుడియా రవి నాయక్, సిరంగి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే మాజీ జెడ్పీటీసీలు వీరమ్మ గోపి సింగ్ నాయక్, సత్తమ్మ పోరిక, అమృ నాయక్ సర్పంచ్, జాటోత్ కిషన్ నాయక్, డాక్టర్ చందు నాయక్, అర్పిత నాయక్, లావుడియా పల్లవి రాజు నాయక్, ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడు బాదావత్ బాలాజీ నాయక్తో పాటు పలువురు బంజారా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అతిథులు చిన్నారిని ఆశీర్వదించి, కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ బంజారా సంస్కృతి, ఆనవాయితీల మధ్య జరిగిన ఈ కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. వేడుకకు హాజరైన ప్రముఖులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు.
