పోలీస్ శాఖలో సేవలకు గుర్తింపుగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న అధికారి.

పోలీస్ శాఖలో సేవలకు గుర్తింపుగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న అధికారి.

ఖమ్మం ప్రతినిధి దేవల్ల ఉపేంద్ర :-  పోలీస్ శాఖలో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందిన సీనియర్ పోలీస్ అధికారి ప్రస్థానం యువ అధికారులకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల పట్ల సేవాభావం, శాంతిభద్రతల పరిరక్షణలో చూపిన ప్రతిభతో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రజలు, సహచర అధికారులు ఆకాంక్షిస్తున్నారు.

 

 

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో విడదీయరాని అనుబంధం

1989లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా తొలి పోస్టింగ్‌తో పోలీస్ సేవలను ప్రారంభించిన ఆయన, అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్, మధిర, దమ్మపేట, మణుగూరు, అశ్వారావుపేట, చింతూరు తదితర ప్రాంతాల్లో ఎస్ఐ, సీఐ, ఏసీపీ, అదనపు ఎస్పీగా సేవలందించారు.

 

 

 

ప్రస్తుత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయనకు పదోన్నతి లభించడం విశేషం. దీంతో జిల్లాతో ఆయనకు మరింత ఆత్మీయ అనుబంధం ఏర్పడిందని స్థానికులు పేర్కొంటున్నారు.

ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో విశేష కృషి

ఖమ్మం నగరంలో ట్రాఫిక్ విభాగంలో సీఐగా, అనంతరం ఏసీపీగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో నగరంలోని ప్రధాన ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. జిల్లాలో పనిచేసిన కాలంలో అనేక క్లిష్టమైన కేసులను ఛేదించి తన ప్రతిభను చాటుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు పొందడంతో పాటు, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే అధికారిగా పేరు సంపాదించారు.

 

 

సేవా పతకాలతో అరుదైన గుర్తింపు

పోలీస్ శాఖలో విశిష్ట సేవలు, క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన పలు ప్రతిష్టాత్మక సేవా పతకాలను అందుకున్నారు. 2000 సంవత్సరంలో రాష్ట్ర పోలీస్ సేవా పతకం, 2008లో పోలీస్ ఉత్తమ సేవా పతకం, 2023లో రాష్ట్ర పోలీస్ మహోన్నత సేవా పతకం అందుకోవడం ఆయన సేవలకు నిదర్శనంగా నిలిచింది.

 

 

పోలీస్ శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవకు ప్రతీకగా నిలిచిన ఈ అధికారి ప్రస్థానం యువతకు, ముఖ్యంగా యువ పోలీస్ అధికారులకు స్ఫూర్తిదాయకంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.