కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి 50 కుటుంబాల చేరిక.

కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి 50 కుటుంబాల చేరిక.

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకురాలు మనీషా లక్ష్మి.

ఖమ్మం ప్రతినిధి దేవల్ల ఉపేంద్ర :- ఏన్కూరు మండల పరిధిలోని కాలనీ నాచారం గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు ఆదివారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకురాలు మనీషా లక్ష్మి మదన్ లాల్ వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు.

 

 

 

అనంతరం కేసుపల్లి గ్రామానికి చెందిన గూగుల్ మోతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె దశదిన కార్యక్రమానికి హాజరైన మనీషా లక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే శ్రీరాంపురం తండాకు చెందిన ఆంగో శ్రీను మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

తదుపరి ఎర్రబడు తండా గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆమె, వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతోందని అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరణ మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని, కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

 

 

 

ఈ కార్యక్రమాల్లో సర్పంచులు జరా సాంబయ్య, బానోతు వెంకన్నతో పాటు నాయకులు మల్లెంపాటి మాధవరావు, మల్లెంపాటి హరిబాబు, అజ్మీరా రైలు, చీటీ ముత్యం, గణేశుల బాబు, పుల్లయ్య, రంగయ్య తదితరులు పాల్గొన్నారు.